VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు

AKP: ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. నక్కపల్లి నుంచి అడ్డరోడ్డు వెళుతున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు కాలేదు.