VIDEO: వృధాగా పోతున్న త్రాగునీరు
SKLM: ఎచ్చెర్ల మండలం రామ్ నగర్‌లో త్రాగునీరు వృధాగా పోతుంది. నీటిని నియంత్రించే ట్యాప్‌లు లేకపోవడంతో నిత్యం నీరు వృధా అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని, నీరు వృధా కాకుండా చూడాలని వారు కోరుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే, కుళాయిలకు ట్యాప్‌లను బిగించాలని స్థానికులు కోరుతున్నారు.