మీడియా సన్మాన సభకు హాజరుకండి: ఏబీవీపీ

మీడియా సన్మాన సభకు హాజరుకండి: ఏబీవీపీ

MBNR: జాతీయ మీడియా దినోత్సవం సందర్భంగా ఆదివారం జడ్చర్ల పట్టణంలోని అంబేడ్కర్ సంఘం కళాభవన్లో ప్రింట్, డిజిటల్ మీడియా రిపోర్టర్లకు సన్మాన సభ ఉంటుందని ఏబీవీపీ కన్వీనర్ సాయికుమార్ తెలిపారు. ఈ సభకు రిపోర్టర్లందరూ హాజరుకావాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభమని, రిపోర్టర్ల హక్కులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని సాయికుమార్ తెలిపారు.