‘పూడికతీత పకడ్బందీగా జరగాలి’

‘పూడికతీత పకడ్బందీగా జరగాలి’

కర్నూలు: జిల్లాలోని 52 వార్డుల్లో చేపట్టిన పూడికతీత పనులను పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పెద్దపడఖాన, దండెగేరి, తదితర ప్రాంతాల్లో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.