ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్
ATP: గుంతకల్లు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని శనివారం రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల అదేన్న కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు వారిని స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.