VIDEO: పలమనేరు పోలీస్ స్టేషన్‌లో అంబలం పూజ
CTR: ఎప్పుడూ కేసులు నేరస్తులతో కిటకిటలాడే పలమనేరు పోలీస్ స్టేషన్‌లో నేడు భక్తి గీతాలు వినిపించాయి. సీఐ మురళీ మోహన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో అయ్యప్పస్వామి అంబలం పూజ నిర్వహించారు. సుమారు వంద మందికి పైగా అయ్యప్పస్వామి భక్తులు భక్తి శ్రద్ధలతో భజనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అయ్యప్ప మాలదారులు ఎర్పాటు చేసారు.