'గ్రంథాలయ సేవలను వినియోగించుకోండి'
NLR: విడవలూరు గ్రంథాలయంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని నవంబర్ 14వ తేదీ నుండి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి నిరూప బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక పఠనాల యొక్క ప్రాముఖ్యత, లైబ్రరీ విశిష్టత, పిల్లలకు సంబంధించినటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.