గంజాయి తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

గంజాయి తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

జగిత్యాల: గొల్లపల్లి (M) లొత్తునూర్ గ్రామ శివారులో మంగళవారం అనుమానాస్పదంగా కనిపిస్తున్న వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని తనిఖీ చేయగా 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లపల్లి ఎస్సై ఎం. కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.