పేకాట జూదరులపై పోలీసు మెరుపు దాడి
BHPL: తిరుమలాపుర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న జూదరుల సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. SI సతీష్ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకొని ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,300 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని.. వారి పై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.