ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ
NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హెచ్‌బీ కాలనీలో నూరే ఇలాహీ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎంపీ కేశినేని చిన్ని బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని, అన్నారు. రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్షలు క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, సహనం వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.