VIDEO: 'ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి'
VZM: ప్రజలందరూ పరిశుభ్రత పాటించి ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని శుక్రవారం గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో జిల్లా పరిషత్ సీఈవో బీబీ సత్యనారాయణ సూచించారు. సిరిపురం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన గ్రామంలో పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. రక్షిత మంచినీటీ ట్యాంకులో క్లోరినేషన్ సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు.