వైద్య సిబ్బందిపై దాడి చేసిన ముగ్గురి అరెస్ట్

వైద్య సిబ్బందిపై దాడి చేసిన ముగ్గురి అరెస్ట్

MNCL: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి 29న మద్యం మత్తులో వైద్యులు, నర్సులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. తిలక్ నగర్‌కు చెందిన గొట్టే పవన్ తేజ్, సంపత్, జాడి విజ్ఞేష్‌లు చెకప్ కోసం వచ్చి డాక్టర్ జయప్రకాశ్‌పై భౌతిక దాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.