MRO ఆఫీసు వద్ద ఆటో డ్రైవర్లు నిరసన

VZM: AUTUC జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆద్వర్యంలో మంగళవారం గజపతినగరం MRO కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ఆటో డ్రైవర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని లేనిపోని జీవోలు, ఫైన్‌లు వేసి రోడ్డున పడేస్తున్నారని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పింది కానీ ఆటో డ్రైవర్లకు భరోసా లేదన్నారు.