నీరు నిలువ ఉండకుండా చర్యలు

MNCL: జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా వరద నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని పోన్కల్ ఈవో రాహుల్ తెలిపారు. భారీ వర్షాలకు పట్టణంలోని రామాలయం, సాయిబాబా టెంపుల్, ఎస్బిఐ బ్యాంక్, కవ్వాల్ చౌరస్తా ప్రాంతాలలో ఉన్న ప్రధాన రహదారిపై నీరు ఏరులై పారింది. బుధవారం ఉదయం స్థానిక ఎస్బిఐ బ్యాంకు ముందు నిలిచిన నీటిని కార్మికుల సహాయంతో తీసివేయించారు.