అనిల్ అంబానీ కుమారుడిని విచారించిన సీబీఐ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీని సీబీఐ విచారించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై ఇటీవల కేసు నమోదైంది. మోసపూరిత చర్యలతో బ్యాంకుకు రూ.228.06 కోట్ల నష్టం కలిగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో భాగంగానే సీబీఐ అన్మోల్ అంబానీని విచారించింది.