'రైతు కూలీలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే'
ప్రకాశం: కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో బుధవారం వ్యవసాయ కూలీలతో మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ ఇంఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా రైతులు వేస్తున్న పంట పెట్టుబడిని పరిశీలించగా, కూలీలతో ముచ్చటించి వారి యోగ క్షేమ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డి కూడా పాల్గొన్నారు.