పొలంలోకి దూసుకెళ్లిన కారు

NDL: పాణ్యంలోని శ్రీ సాయిబాబా ఆలయం వద్ద జాతీయ రహదారిలో ఆదివారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ నిద్ర మత్తే కారణంగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.