గుడ్లవల్లేరులో ప్రతిజ్ఞ చేసిన పోలీసులు

కృష్ణా: గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్‌లో బుధవారం “నషా ముక్త్ భారత్ అభియాన్”లో భాగంగా ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బందితో ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నివారించడంతో పాటు, ఇతరులను కూడా దానిని వదిలించేందుకు ప్రోత్సహించాలని, ఆరోగ్యవంతమైన మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.