నేడు లింగంపేట్‌లో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు లింగంపేట్‌లో పర్యటించనున్న ఎమ్మెల్యే

KMR: లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో నేడు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ పర్యటనలో ఆయన పోతాయిపల్లి, కన్నాపూర్, పోల్కంపేట్, కోమటిపల్లి, అనంతరం నాగిరెడ్డిపెట్ మండలంలోని పల్లెబొగుడు తండా, జప్తి జానకంపల్లి, నాగిరెడ్డిపేట గ్రామాలను సందర్శిస్తారు. MLA పర్యటనను విజయవంతం చేయాలన్నారు.