చిన్నారులకు బాలామృతం పంపిణీ చేసిన కార్పొరేటర్
PDPL: రామగుండం 21వ డివిజన్ లక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు బాలామృతం, కోడిగుడ్లను కార్పొరేటర్ కందుల స్వరూప పంపిణీ చేశారు. అంగన్వాడీల ద్వారా అందే పౌష్ఠికాహారాన్ని గర్భిణులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, వీర్లపల్లి అంగన్వాడీ పాఠశాల విద్యార్థులకు ఆర్ఎఫ్‌సీఎల్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ అందించారు.