పలుకూరులో వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవాలు
NDL: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి ఉత్సవాలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. పలుకూరు గ్రామానికి చెందిన జేకేఆర్ సంస్థ అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి ముందుగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం గురించి ప్రజలకు వివరించారు.