గొర్రెలపైకి దూసుకెళ్లిన ఆటో

ATP: అగళి మండలం పీ.బ్యాడిగెర గ్రామ సమీపంలోని సుంకలకట్ట వద్ద హైవేపై శనివారం రాత్రి వేగంగా వచ్చిన ఆటో గొర్రెలు, గొర్రెల కాపరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 గొర్రెలు మృతి చెందాయి. నందరాజనపల్లికి చెందిన గొర్రెల కాపరి గిరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గొర్రెలను మేపుకొని ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.