రేపు జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు
AKP: అనకాపల్లి మండలం తుంపాల క్రీడా మైదానంలో ఆదివారం తేదీన జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు శాంత కుమారి, కార్యదర్శి దాడి సాంప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు కర్నూలులో వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.