వంశీ ఫోన్ లభించేనా.?

వంశీ ఫోన్ లభించేనా.?

కృష్ణా: హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ ఇంట్లో శనివారం పోలీసుల సోదాలు నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు వంశీ నివాసంలో పోలీసుల సోదాలు చేశారు. వంశీ ఇంట్లోనే సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ చూపించడంతో ఫోన్ కోసం ఇంట్లో విస్తృతంగా పోలీసులు గాలించారు. చివరికి వంశీ ఇంట్లో ఫోన్ లభించకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చారు. వంశీ ఫోన్‌లోనే కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.