BREAKING: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు
TG: మెదక్ జిల్లాలోని స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారంలోని MS అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో పేలుడు జరిగింది. ఆ పరిసర ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.