'జిల్లా యంత్రాంగంతో భాగస్వాములు కావాలి'
PPM: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు మరింత ఉత్సాహంగా పాల్గొని, జిల్లా ఆర్థికవృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లా యంత్రాంగంతో భాగస్వాములు కావాలని కోరారు.