3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: కలెక్టర్
BHNG: జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యంగా పని చేస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామం పోచంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.