వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి
NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ సోమవారం వాలీబాల్ పోటీలను దసరా పండుగ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహించాలని అన్నారు. ఆటలో గెలుపోటములు సహజమన్నారు.