మహిళలకు ఫ్రీ బస్సు ఎప్పుడు.?

కృష్ణ: కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా ఉచిత బస్సు విషయంలో ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదని వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి త్రివేణి రెడ్డి ఆరోపించారు. మంగళవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కిందన్నారు.