హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
HYD: సికింద్రాబాద్‌లో ఎస్టీఎఫ్ పోలీసులు ఇద్దరు డ్రగ్స్ విక్రేతలను అరెస్ట్ చేశారు. హరిబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని నుంచి 16 హ్యాష్ ఆయిల్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బొల్లారంలో గంజాయి అమ్ముతున్న శశికాంత్‌ను అరెస్ట్ చేసి అతని నుంచి 3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.