ఉచిత పశు వైద్య శిబిరం
SRCL: వీర్నపల్లి మండలంలోని బంజేరు గ్రామంలో సర్పంచ్ బట్టు కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం వల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని, ప్రభుత్వం అందిస్తున్న టీకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దేవయ్య, పశువైద్యాధికారి డాక్టర్ సమీద పాల్గొన్నారు.