'నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం'

'నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం'

PLD: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. వెల్దుర్తిలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, ఎన్‌ఆర్‌జీఎస్, మున్సిపల్, వ్యవసాయశాఖల అధికారులతో చర్చించారు. మంజూరైన గ్రాంట్ల వినియోగంపై సూచనలు చేసి, పట్టణంలో సీసీ రోడ్లు, రింగ్ రోడ్ల పనులను సమీక్షించారు. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలన్నారు.