మహిళా సంఘాలకు రుణ సాయం పంపిణీ
NRML: నిర్మల్‌లోని రామ్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తి రుణ చెక్కులను అందజేశారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. ఆర్థికంగా ఎదిగేందుకు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, పరిసరాల పరిశుభ్రతపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.