'అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలి'
MDK: అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత సూచించారు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.