బార్లపై చర్యలు తీసుకోండి: AIYF

కృష్ణా: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బార్ల మీద చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ కార్యదర్శి లంక గోవిందరాజులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రాన్ని అందించారు. విజయవాడ నగర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా బార్లు కొనసాగుతున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.