ప్రత్యేక పూజలు అందుకున్న ఉలిగమ్మ అమ్మవారు
ATP: బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్‌లో వెలిసిన ఉలిగమ్మ అమ్మవారికి శ్రావణమాస శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచామృత, కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని విశేషంగా అలంకరించి, నైవేద్యాలు అందించారు. శ్రావణమాసంలో అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.