నీటి పథకం పనులను ప్రారంభించాలి

నీటి పథకం పనులను ప్రారంభించాలి

WNP: అమృత్ పథకం కింద కొత్తకోట మున్సిపాలిటీకి మంజూరైన రూ.14.95 కోట్ల నిధులతో మంచినీటి అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని BJP నాయకుడు కొమ్ము భరత్ భూషణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం సమర్పించారు. 2023లో నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.