ఆదర్శంగా నిలుస్తున్న' గోయగాం పాఠశాల'

ఆదర్శంగా నిలుస్తున్న' గోయగాం పాఠశాల'

ASF: కెరమెరి మండలం గోయగాం MPPS పాఠశాల గ్రామస్తుల సహకారంతో ఆదర్శంగా నిలుస్తోంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత కలిసి పనిచేయడంతో పాఠశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. పాఠశాలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంగా మార్చడం, నాణ్యమైన బోధన అందించడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాఠశాల అభివృద్ధి కోసం గ్రామంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు.