రోడ్డు ప్రమాదంలో యాచకుడు మృతి
RR: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యాచకుడు మృతిచెందిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అత్తాపూర్ పిల్లర్ నంబర్ 118 వద్ద ఓ యాచకుడు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొట్టింది. తీవ్రగాయాలైన యాచకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.