'ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటా'
మంచిర్యాల: జిల్లాలో ఫిబ్రవరిలో జరిగిన కార్పొరేటర్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన తుమ్మల నరేష్‌కి ఆదివారం పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సార్ రావుని కూడా కలిసి, వారిని అభినందించారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని, సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని పేర్కొన్నారు.