నవోదయ మోడల్ టెస్ట్ కు విద్యార్థుల హాజరు
AKP: నర్సీపట్నంలో నవోదయ మోడల్ టెస్ట్ పరీక్షను ఆదివారం నిర్వహించారు. పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో జరిగిన మోడల్ పరీక్షలో వివిధ మండలాల నుంచి 340 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నామని పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ తెలిపారు. పరీక్షలు అనంతరం ఫలితాలు ప్రకటిస్తామన్నారు.