సీఎం సహాయనిధి పేదల పాలిట పెన్నిధి

సీఎం సహాయనిధి పేదల పాలిట పెన్నిధి

W.G: సీఎం సహాయనిధి రోగుల పాలిట పెన్నిధి లాంటిదని కాళ్ల మండల టీడీపీ అధ్యక్షుడు ఆరేటి వెంకటరత్నప్రసాద్, డీసీ ఛైర్మన్ గోకరాజు శివరామరాజు అన్నారు. జువ్వలపాలెం గ్రామానికి చెందిన పాన్నపల్లి మల్లేశ్వరరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 1.77లక్షల చెక్కును సోమవారం వారికి అందించారు. బాధితులు డిప్యూటీ స్పీకర్ రఘురామకు కృతజ్ఞతలు తెలిపారు.