'ఎండల నుంచి ఉపశమనానికి పకడ్బందీ చర్యలు'
కర్నూలు నగరంలో పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు చేపట్టిన్నట్లు కమిషనర్ పీ. విశ్వనాథ్ ఇవాళ తెలిపారు. రూ. 56.65 లక్షలతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 9 చలివేంద్రాలు, 8 చోట్ల షేడ్ నెట్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు అదనపు ట్యాంకర్లు వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడించారు.