VIDEO: పుట్టపర్తికి చేరుకున్న సీఎం చంద్రబాబు
సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు CM చంద్రబాబు నాయుడు మంగళవారం పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేయగా మంత్రులు, అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం రాత్రికి పుట్టపర్తిలోనే బస చేయనున్నారు. రేపు ప్రధాని మోదీతో కలిసి శతజయంతి వేడుకల్లో పాల్గొననున్నారు.