'నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి'
మెదక్ పట్టణంలో జరుగుతున్న CITU రాష్ట్ర 5వ మహాసభలు రెండో రోజు వినాయక కన్వెన్షన్‌లో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత, కార్యదర్శి తపన్ సేన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల సభ జరిగింది. కేంద్రం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేయాలని, కనీస వేతనం అమలయ్యే వరకు ఐక్యంగాపోరాడాలని ఈ సభ తీర్మానించినట్టు తెలిపారు.