VIDEO: గర్భిణీలకు సామూహిక సీమంతాలు
SRCL: వేములవాడ పట్టణం 14వ వార్డులోని అంగన్వాడి పాఠశాలలో గర్భిణీలకు సామూహిక సీమంతాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ఆఫీసర్ పరుశరాం మాట్లాడుతూ.. అంగన్వాడి వయస్సు పిల్లలందరినీ అంగన్వాడి పాఠశాలకు పంపించాలన్నారు. అంగన్వాడీలో ఇచ్చే పోషక ఆహారాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. అంగన్వాడి టీచర్ శారద, మహిళలు, గర్భిణీలు పాల్గొన్నారు.