ఓ యువతిపై అత్యాచారయత్నం

ఓ యువతిపై అత్యాచారయత్నం

SS: నల్లచెరువు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన రామాంజినేయులు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంటి బయట పనులు చేసి లోపలికి వెళ్లిన యువతిని రామాంజినేయులు పట్టుకొని కొట్టడంతో గట్టిగా కేకలు వేసింది. వాటిని విని యువతి తండ్రి రావడం గమనించిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా, చుట్టుపక్కల వారు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.