VIDEO: ఎచ్చెర్లలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం

SKLM: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకి పెట్టుబడి అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఎచ్చెర్ల మండల కేంద్రంలో స్వచ్ఛాంధ్ర- - స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ నిషేధం అందరి బాధ్యతని వాటి స్థానంలో గుడ్డ సంచులను వినియోగించాలని సూచించారు.