చిన్నారిపై ప్రైవేటు పాఠశాల ఆయా దాష్టీకం
TG: నర్సరీ విద్యార్థిని పట్ల ఓ ప్రైవేటు పాఠశాల ఆయా అమానవీయంగా ప్రవర్తించిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా ఇష్టారీతిన కొట్టింది. చిన్నారిపై కాలు వేసి తొక్కుతూ కర్కశంగా వ్వవహరించింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.