పేదల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం: సీఎం

పేదల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం: సీఎం

TG: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. 'పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్పనేత సురవరం సుధాకర్ రెడ్డి. రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత. విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగారు. సురవరం కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది' అని అన్నారు.